
నిజామాబాద్: చికెన్ వేయలేదని మేనమామను కట్టెతో కొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన చింతల రాజు ఇంట్లో మంగళవారం చికెన్ వండారు.
రాజు అక్క కుమారుడు సుమన్ మద్యం మత్తులో చికెన్ వేయాలని కోరగా ఇద్దరి మధ్య మాటలు లేనందున చికెన్ వేయలేమని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన సుమన్ పక్కనే ఉన్న కట్టెతో రాజు తలపై బాదాడు. బాధితుడిని జీజీహెచ్‌కు తరలించారు. రాజు భార్య గౌరవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment