కొండమల్లేపల్లి : స్థానిక కందుల కొనుగోలు కేంద్రంలో రైతు పేరు మీద కందులను విక్రయించిన ఇద్దరు దళారులపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చెరమంద రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం వెంకటయ్య పేరు మీద 40 క్వింటాళ్ల కందులు విక్రయించినట్లు నమోదై ఉంది.
ఈ మేరకు పాల్వాయి గ్రామానికి వెళ్లి విజిలెన్స్ అధికారులు విచారణ చేయగా సదరు వెంకటయ్య ఈ ఏడాది భూమి సాగు చేయలేదని తేలింది. దీంతో అధికారులు విచారణ చేపట్టి పదురు రైతు పేరు మీద పాల్వాయి గ్రామానికి చెందిన దళారులు గిరి శేఖర్, రమేశ్ కందులు విక్రయించినట్లు వెల్లడైంది. వీరిపై గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో డీసీపీఓ కృష్ణ, ఎస్‌ఐ గౌస్, సిబ్బంది వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళారులపై కేసు నమోదు
Published Thu, Mar 9 2017 3:11 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
Advertisement
Advertisement