
బీఏ తప్పింది!
అంజలీ ఠాకూర్ ప్రధాన పాత్రలో రూపొందిన హిందీ చిత్రం ‘బ్యాచిలర్స్ ఆఫ్ లవ్.. బీఏ ఫెయిల్’. ఈ చిత్రాన్ని రాజు, పంకజ్ తెలుగులోకి అదే పేరుతో అనువదించారు. ఈ 27న చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బీఏ తప్పిన తర్వాత ఓ సంప్రదాయ యువతి చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుంది. అక్కడ తనను మోసం చేసినవాళ్లను అంతం చేసి, తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం: హరివిందర్ పాల్.