తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్య కారుడు గల్లంతయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులోని సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు శుక్రవారం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడికి మరబోటు తిరగబడటంతో గరికిన రాజు(20) సముద్రంలో పడి గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు మత్స్య కారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.