చేగుంట మండలం చిన్నశివనూరు శివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని రాజు(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. వివరాలు..చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన రాజుకు చిన్నశివనూరుకు చెందిన అరుణ అనే యువతితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత రాజు ఇల్లరికం వచ్చాడు. అయితే ఏమైందో ఏమో కానీ రెండు రోజుల క్రితం సొంతూరులో ఉన్న తల్లి వద్దకు వెళ్లి తాను ఇల్లరికం ఉండనని తల్లికి చెప్పాడు. దీంతో తల్లి, తన కుమారుడికి సర్థి చెప్పి పంపించింది. నిన్న చిన్న శివనూరు వెళ్లిన రాజు అకస్మాత్తుగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నశివనూరులో యువకుడి ఆత్మహత్య
Published Tue, Aug 2 2016 5:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement