పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
పాతకక్షలే కారణం
కొలిమిగుండ్ల (కర్నూలు): పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బి.ఉప్పులూరుకు చెందిన కిట్టయ్య (30) పొలం నుంచి ఇంటికి తన సోదరుడు రాజుతో కలిసి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో కిట్టయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దుండగులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.