kittaiah
-
నగల కోసం తల్లిని హతమార్చాడు
హన్వాడ(మహబూబ్నగర్): నగల కోసం తల్లిని చంపాడో కిరాతకుడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం తిరుమలగిరిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పత్తెపురం పెంటయ్య, చెన్నమ్మ(55) దంపతులు. వీరి ఏకైక కొడుకు కిష్టయ్య. ఆదివారం ఉదయం పెంటయ్య తన అత్తగారి గ్రామమైన గండీడ్ మండలం చౌదర్పల్లికి వెళ్లాడు. రాత్రి తిని పడుకునే సమయంలో చెవిగంటీలు తీసి ఇవ్వాలని కిష్టయ్య తన తల్లి చెన్నమ్మపై ఒత్తిడి పెంచాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన కిష్టయ్య.. విపరీతంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం తల్లి చెవులను కొడవలితో కోసి గంటీలను తీసుకెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సోమవారం ఉదయం పెంటయ్య రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, నిందితుడు కిష్టయ్య క్రూరుడని, ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఇతని ప్రవర్తన కారణంగా భార్యలు ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుని మృతి
అవుకు: కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. అవుకు పట్టణంలో కిట్టయ్య(20) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
చింతపల్లె: నల్లగొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లె మండలంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని మల్లారెడ్డిపల్లెకి చెందిన కిట్టయ్య(40)కు వ్యవసాయంలోగత ఏడాది నష్టాలు వచ్చాయి. దీనికి తోడు ఈ ఏడాది పంట సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురైన కిట్టయ్య పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వ్యక్తి దారుణ హత్య
పాతకక్షలే కారణం కొలిమిగుండ్ల (కర్నూలు): పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని బి.ఉప్పులూరుకు చెందిన కిట్టయ్య (30) పొలం నుంచి ఇంటికి తన సోదరుడు రాజుతో కలిసి వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో కిట్టయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దుండగులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.