
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురై మృతిచెందడం స్థానికులను కలచివేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్‌స్టేషన్‌లో రాజు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో తోటి పోలీసులు చికిత్స నిమిత్తం రాజును ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే హెడ్ కానిస్టేబుల్ మృతిచెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.