ఒట్టావా: కెనడాలో మరో ఖలిస్తానీ తీవ్రవాది హత్యకు గురయ్యాడు. సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె అనే ఖలిస్థాన్ తీవ్రవాది ముఠా తగాదాల్లో హత్యకు గురైనట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి.
అసలే కెనడా భారత్ దేశాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య విబేధాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఆ వివాదం సద్దుమణుగక ముందే మరో ఖలిస్థానీ తీవ్రవాది హత్య కలకలం సృష్టిస్తోంది. సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె అనే ఖలిస్థాన్ తీవ్రవాది బుధవారం జరిగిన ముఠా తగాదాల్లో హత్యకు గురయ్యాడని విన్నిపెగ్‌లో ప్రత్యర్థి ముఠా జరిపిన దాడిలో సుఖా దుంకెన్ చనిపోయినట్లు ఎన్‌ఐఎ వర్గాలు తెలిపాయి.
పంజాబ్‌లోని మోగాకు చెందిన సుఖ దునెకె 2017లో నకిలీ పాస్‌పోర్టు సాయంతో కెనడాలో ప్రవేశించి ప్రస్తుతం ఏ కేటగిరీ గ్యాంగ్‌స్టర్‌గా చెలామణి అవుతున్నాడు. కెనడాలోని ఉగ్రవాద సంస్థ ఎన్ఐఏ విడుదల చేసిన 43 మంది ఖలిస్థాన్ తీవ్రవాదుల జాబితాలో సుఖ దునెకె పేరు కూడా ఉంది. అంతేకాదు ఖలిస్తానీ తీవ్రవాది అర్షదీప్ డల్లాకు సుఖ్‌దూల్ అత్యంత సన్నిహితుడు.
కెనడాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ దృష్ట్యా అక్కడి భారతీయులకు ప్రయాణాలు విషయమై పలు జాగ్రత్తలను సూచించింది భారత్ విదేశాంగ శాఖ. ప్రయాణాలు చేయదలచుకున్న అక్కడి భారతీయులకు పలు మార్గదర్శకాలను సూచించింది భారత ట్రావెల్ అడ్వైజరీ కమిటీ.
Sukhdool Singh @ Sukha Duneke, a gangster who escaped to Canada from Punjab, India in 2017 on forged documents, was shot dead today in Winnipeg, Canada by unknown assailants.
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023
The Punjab Police Anti-Gangster Task Force (AGTF) believes he supported the DB gang and joined… pic.twitter.com/TFxOsVzsno
ఇది కూడా చదవండి: కెనడా బామ్మను ప్రేమించి, పెళ్లాడిన పాక్ కుర్రాడు
Comments
Please login to add a commentAdd a comment