చెన్నై: తమిళనాడులో మే 21న జరిగే పోలీసు ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షలకు హిజ్రాలు ఎంతో ఆసక్తిగా దరఖాస్తులు పెట్టుకున్నారు. యాబై మందికి పైగా ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. సమాజంలో చిన్న చూపునకు గురైన హిజ్రాలు కాలంతోపాటు వారు మారుతూ విద్య, ఉపాధి ద్వారా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ఇటీవల ఎస్‌ఐగా ఎంపికైన ప్రితికా యాషిన్ ప్రస్తుతం ధర్మపురిలోని పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పదవీ బాధ్యతలు వహిస్తున్నారు. ఈమె దేశంలోనే మొట్ట మొదటి హిజ్రా ఎస్‌ఐ. ఆమెని మార్గదర్శిగా ఎంచుకుని పలువురు హిజ్రాలు పోలీసు ఉద్యోగాలలో ఆసక్తి చూపుతున్నారు. పోలీసు శాఖలో ఖాళీ స్థానాల భర్తీకి మే 21వ తేదీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 6.32 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా అందులో 50 మంది హిజ్రాలు కావడం విశేషం. పోలీసు శాఖలో హిజ్రాలు చేరడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారు ఎంతో ఆసక్తి చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనం.
ఉద్యోగాలపై హిజ్రాల ఆసక్తి
Published Fri, May 12 2017 7:30 PM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
Advertisement