హిజ్రాలతో మాట్లాడుతున్న పోలీసు
పెరంబూరు: రాత్రివేళల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హిజ్రాలను పోలీసులు హెచ్చరించారు. రాత్రివేళల్లో బైకులు, కార్లల్లో వచ్చే వాహనదారులను హిజ్రాలు వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్, అదనపు కమిషనర్ సారంగం పోలీసులకు ఉత్తర్వులిచ్చారు. జాయింట్ కమిషనర్ అన్భు ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అందులో భాగంగా స్థానిక చూలైమేడు, భజన్‌కోవిల్ వీధిలోని కల్యాణ మండపంలో మంగళవారం హిజ్రాల సమావేశాన్ని నిర్వహించారు. ట్రిప్లికేన్ జాయింట్ కమిషనర్ సెల్వనాగరత్నం, నుంగంబాక్కం అసిస్టెంట్ కమిషనర్ ముత్తువేల్ పాండి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 100 మంది హిజ్రాలు పాల్గొన్నారు. వారితో ఇకపై రాత్రివేళల్లో ఆసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వృత్తికి బదులు అలంకారనిపుణులు, హోటల్ రిసెప్షనిస్ట్ లాంటి ఉద్యోగ ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అంగీకరించిన హిజ్రాలు తాము కలిసి చర్చించి బదులిస్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న హిజ్రాలతో పలువురు ఇంజినీరింగ్, ఎంబీఏ, బీఎస్‌సీ, ఎంఏ, ఎంఎస్‌సీ, డిప్లమో విద్యార్థులు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment