
అర్ధరాత్రి తమ ఇళ్ల తలుపులు బాదుతున్నారని, తెరవకపోతే ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులను పడేస్తున్నారని
ఫిలింనగర్: ఫిలింనగర్‌లోని గౌతంనగర్ బస్తీలో కొందరు హిజ్రాలు అద్దెకుంటున్నారని వీరి ఆగడాలతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోతోందని, అరుపులు కేకలతో న్యూసెన్స్ చేస్తున్నారని దీనిపై ప్రశ్నిస్తే తమపై దాడులకు దిగుతున్నారని బస్తీకి చెందిన ఎం. చంద్రకళ అనే మహిళతో పాటు పలువురు ఆదివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తమ ఇళ్ల తలుపులు బాదుతున్నారని, తెరవకపోతే ఇళ్ల ముందు అసభ్యకర వస్తువులను పడేస్తున్నారని చిన్న పిల్లలు వీరిని చూసి భయపడుతున్నారని ఆరోపించారు. వీరి ఆగడాలను నియంత్రించాలని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న గౌతంనగర్ బస్తీవాసులు