
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హిజ్రాల మేలు కోసం ట్రాన్స్‌జెండర్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా వారికోసం మరిన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్‌జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు నివసించే ప్రాంతాల్లో అందిరి మాదిరిగానే మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది.
ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనుంది. మొత్తంగా వారికి సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వం పాలసీ అమలు చేస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేయనుంది. ట్రాన్స్‌జెండర్స్ హక్కులను కాపాడటంతోపాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వ ప్రస్తుత (2022–23) బడ్జెట్‌లో రూ.2 కోట్లు కేటాయించడం విశేషం.
చదవండి: Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment