హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలి
హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలి
Published Tue, Aug 16 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
కర్నూలు(అర్బన్): స్రీ, పురుషలతో పాటు హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించాలని హిజ్రా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. మానవులతో సమానంగా హిజ్రాలకు కనీస హక్కులు కల్పించాలన్న డిమాండ్‌పై ఇండియన్ నేషనల్ సమతా హిజ్రా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్‌లో హిజ్రాలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 4.5 కోట్ల మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని, వీరి కోసం రూపొందించిన రైట్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్స్–2015 బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో పొందలేదన్నారు. ఈ బిల్లును చట్టబద్ధం చేసి సమాజంలో అందరితో సమానమే అనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో హిజ్రాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శులు స్వప్నమ్మ, దీపారెడ్డి, ఇందు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మయూరి, కర్నూలు నగర నాయకులు ప్రవీణ, స్వప్న, జెస్సీ తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, ఉపాధ్యక్షుడు రామరాజు, ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు.
Advertisement