
చోరీలకు పాల్పడుతున్న హిజ్రాల అరెస్ట్
విశాఖపట్నం (పెదవాల్తేరు): రైళ్లలో యాచిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు, నగదు తస్కరిస్తున్న ఇద్దరి హిజ్రాలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే డీఎస్పీ మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి దువ్వాడ స్టేషన్ మధ్యలో ప్రయాణికుల నుంచి యాచిస్తున్నట్లు నటించి హిజ్రాలు పాలూరి వెంకట్ అలియాస్ జెనీలియా(23), పరపతి అనిల్ అలియాస్ సుక్కూ(23) కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్నారు.
గురువారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి విలువైన వస్తువులు, రూ.28,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.