
బోనమెత్తిన హిజ్రాలు
శ్రీశైలం: తెలంగాణలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే అంతే ఘనంగా జరపాలనుకున్నారు ఈ హిజ్రాలు. అందుకే ఆదివారం విజయవాడకు చెందిన కొంతమంది కలిసి శ్రీశైల భ్రమరాంబకు బోనాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీశైలంలోని గంగాధర మండపం వద్ద ఒక హిజ్రా బోనం తలపై పెట్టుకుని రాగా.. మరో ముగ్గురు హిజ్రాలు ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలను సమర్పించారు.