
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. నాయకుల వెంట నడవడానికి, జై కొట్టడానికి మనుషులు కావాలి కదా. ఆ కొరతను ఇళ్ల పని మనుషులు, హిజ్రాలు తీరుస్తున్నారు. వారికి కూడా రాబడి బాగానే లభిస్తోంది.
బనశంకరి: ఎన్నికల పుణ్యమా అని బెంగళూరు మహానగరంలో ఇళ్ల పనిమనుషులకు భలే డిమాండ్ ఏర్పడింది. ఇళ్లలో పనులు చేపట్టే పని మనుషులు సెలవులు పెట్టి వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. నెలంతా ఐదారు ఇళ్లలో ఇంటిపనులు చేసినా ఏడెనిమిదివేలు సంపాదించడం కష్టం. కానీ ఎన్నికల ప్రచారానికి వెళితే రోజుకు రూ. 500 నుంచి రూ.1000 నగదు ఇస్తుండటంతో వారికి బాగా గిట్టుబాటవుతోంది. ఎన్నికల ప్రచారానికి వివిధ పార్టీల నేతలు ఇళ్లలో పనులు చేపట్టే మహిళలను వినియోగించుకోవడంతో వీరికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం ఇళ్లకు వెళ్లి చెత్త ఊడ్చి, బట్టలు ఉతికి, పాత్రలు శుభ్రం చేసి వెళ్లేవారు. ఇంతలో ఎన్నికలు ఆశాదీపంలా కనిపించాయి. నగరంలో పనిమనుషులకు సహజంగానే డిమాండ్ ఎక్కువ. బిజీబిజీ జీవితంలో ఇంటి పనులు చేసుకోలేని గృహిణులు, మహిళా ఉద్యోగినులకు పని మనుషులే ఆసరా. అయినప్పటికీ శ్రమ దోపిడీకి కొదవ లేదు. పనిమనుషులతో బండెడంత చాకిరీ చేసుకుని కాస్తా కూలీ ముట్టజెబుతారు. వారికి నెలకు రూ.2–3 వేలు మాత్రమే జీతమిస్తారు. అదే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే రోజుకు రూ. 500 నుంచి రూ.1000 వరకు సులభంగా సంపాదించవచ్చు.
ఏమేం చేయాలంటే...
ఎన్నికల్లో వీరి పనల్లా.. రాజకీయ నేతల వెంట ప్రచారానికి వెళ్లడం. జెండాలు మోయడం, జై కొట్టడం, ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగటం, సభలు, సమావేశాలకు వెళ్లడం వంటివే. టికెట్ల కోసం బ ల ప్రదర్శన నాటి నుంచి ఎన్నికల్లో గెలిచి ర్యాలీ లు జరిపే వరకు వీరి అవసరం నాయకులకు చా లానే ఉంటుంది. కూలీతో పాటు టిఫిన్లు, బోజనా లు, మజ్జిగ, క్రూల్‌డ్రింక్స్‌ను ఉచితంగా అందిస్తా రు. ఈ మహిళలు తమ పిల్లలను ప్రచారానికి తీసుకెళుతున్నారు. వారికి కూడా నాయకులు తృణమో ఫణమో ముట్టజెబుతుంటారు.
ఇంటికే వాహనం
మహిళలను ప్రచారానికి తీసుకెళ్లడానికి నాయకులే వాహనాలు పంపుతారు. మురికివాడలు, వివిధ కాలనీల నుంచి వాహనాల్లో తరలించడానికి ఒక్కో ఏరియా కు ఒక టీమ్ లీడర్ ను నియమిస్తారు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు వేతనం అందిస్తారు. మహిళలకు పార్టీ బేధాలు లేవు, ఏ రాజకీయపార్టీ కార్యకర్తలైనా సరే ఇళ్లు వద్దకు వచ్చి ప్రచారానికి ఆహ్వానిస్తే చాలు వెళ్తారు, సాయంత్రానికి వేతనం అందించాలి అంతే. అయితే ఇంటి పనిమనుషులు గైర్హాజరుతో గృహిణులకు ఇబ్బందులు తప్పడం లేదు.
మంగళముఖిలకూ డిమాండ్
ఎన్నికల ప్రచారానికి సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు వంటి సెలబ్రిటీలను ఆశ్రయించడం ఆనవాయితీ కానీ ఈసారి సెలబ్రిటీల కంటే హిజ్రాలకు బాగా డిమాండ్ ఏర్పడింది. హిజ్రాల ముఖం చూస్తే శుభ సూచికమనే నమ్మకం కొన్ని ప్రాంతా ల్లో ఉంది. అందుకే వారికి మంగళముఖిలని కూడా పిలుస్తారు. పలుచోట్ల అభ్యర్థులు ఈ న మ్మకంతో ప్రచారానికి హిజ్రాలను పిలిపిస్తున్నా రు. పైగా వారుంటే సందడి కూడా రెట్టింపవుతుం ది. దీంతో బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలకు డిమాండ్ పెరిగింది. జీవనోపాధి కోసం పాటుపడే హిజ్రాలకు ఎన్నికలు అదృష్టంగా వచ్చిపడింది. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కూడా వందలాది మంది హిజ్రాలను నగరానికి క్యూ కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment