
స్నేహితురాలే హంతకురాలు!
అన్నానగర్ : అదృశ్యమైన ఓ మహిళ కేసులో చిక్కుముడి వీడింది. సదరు మహిళను స్నేహితురాలే కిరోసిన్ పోసి సజీవదహనం చేసిందని అని పోలీసులు గుర్తించారు.
తిరువట్టార్ సమీపంలో సారూర్ ప్రాంతానికి చెందిన కూలీ ఇన్సెంట్ (42). ఇతని భార్య శశికళ (36). వీరికి ఇద్దరు కుమారులు. మార్చి 25న ఉదయం శశికళ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఇన్సెంట్ బంధువుల ఇళ్లు సహా పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో అతను తిరువట్టార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శశికళకు నాగర్‌కోవిల్‌కు చెందిన కళతో పరిచయమై ఉన్నట్లు తెలియడంతో ఆమెను పోలీసులు విచారణ చేశారు. విచారణలో నెల్లై జిల్లా దిసైయన్‌విలై శ్మశానంలో శశికళను సజీవదహనం చేశానని ఆమె ఒప్పుకుంది. అనంతరం శశికళ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టిన చోటును పోలీసులకు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.