
నా ఉద్యోగం నటనే
పొలిటికల్ బ్యాటింగ్‌కి పిచ్ పర్‌ఫెక్ట్‌గా ఉందో? లేదో? చూసుకుంటున్నారని తమిళ జనాలు తలైవా (నాయకుడు) రజనీకాంత్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మొన్నీ మధ్య ఆయన అభిమానులను మీట్ అయితే... ‘ఇవి ఫ్యాన్స్ మీటింగులు కాదు... పొలిటికల్ మీటింగులే’ అనే కామెంట్స్ వినిపించాయి. తలైవా కూడా‘దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తా’ అన్నారు.
ఆయన ధోరణిపై కొందరు డైరెక్టుగా, మరికొందరు ఇన్‌డైరెక్టుగా సెటైర్స్ వేశారు. వాటిపై మీ కామెంట్ ఏంటి? అని రజనీను అడిగితే... ‘‘కాలా’ షూటింగ్ కోసమని ముంబయ్ వెళ్తున్నా. నా ఉద్యోగం నటనే. దాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మీరు (మీడియాను ఉద్దేశిస్తూ) మీ వర్క్ చేస్తున్నారు. చేయండి. నన్ను నా వర్క్ చేసుకోనివ్వండి’’ అన్నారు. నటన అనే ఉద్యోగం నుంచి రాజకీయం అనే ఉద్యోగానికి మారే ఉద్దేశం రజనీకి ఉందో... లేదో!! అది తెలుసుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలు పక్కన పెడితే... పా. రంజిత్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘కాలా’ షూటింగ్ ఆదివారం ముంబయ్‌లో మొదలైంది.