‘కాలా’ కోసం ముంబై ర్యాప్‌ గ్రూప్‌! | A popular rap troupe from Mumbai will be part of Rajinikanth's KAALA ... https://regional.pinkvilla.com › Tamil › News | Sakshi
Sakshi News home page

‘కాలా’ కోసం ముంబై ర్యాప్‌ గ్రూప్‌!

Published Tue, Sep 12 2017 12:32 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

‘కాలా’ కోసం  ముంబై ర్యాప్‌ గ్రూప్‌!

‘కాలా’ కోసం ముంబై ర్యాప్‌ గ్రూప్‌!

అది ముంబైలోని ధారావి. ప్రపంచంలో ఉన్న పెద్ద మురికివాడల్లో అదొకటి. అక్కడ మురికిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఓ ర్యాప్‌ గ్రూప్‌ చాలా ఫేమస్‌. ఆ గ్రూప్‌లో ఉన్నది నలుగురే. టీవీ షోస్, స్ట్రీట్‌ షోస్‌లో ఈ ర్యాప్‌ గ్రూప్‌ చేసే సందడికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, మరాఠీ, మలయాళం భాషల్లో ఈ గ్రూప్‌ సాంగ్స్‌ తయారు చేసి, పాడుతుంటారు. ఈ ర్యాప్‌ గ్రూప్‌కి ఓ జాక్‌పాట్‌ తగిలింది.

ఏకంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘కాలా’లో ఛాన్స్‌ దక్కింది. చిత్రదర్శకుడు పా. రంజిత్‌ వీళ్లను హిప్‌–హాప్‌ గ్రూప్‌గా సినిమాలో చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లో వచ్చే పాటకు ఈ ర్యాప్‌ గ్రూప్‌ ట్యూన్‌ కూడా రెడీ చేసింది. అంతా ఓ కలలా అనిపిస్తోన్న ఈ గ్రూప్‌కి రజనీకాంత్‌ని కలవడం ఓ స్వీట్‌ షాక్‌లా అనిపించిందట. షూటింగ్‌ స్పాట్‌లో రజనీ సార్‌ని కలసినప్పుడు నోట మాట రాకుండా ఆయన్ను చూస్తూ ఉండిపోయామని ర్యాప్‌ గ్రూప్‌లో ఒకరైన టోనీ సెబాస్టియన్‌ పేర్కొన్నారు. సూపర్‌స్టార్‌ రజనీ సార్‌ సినిమాలో ఛాన్స్‌ రావడం మాకు ఆనందంగా ఉందన్నారు. అంతే... ప్రతిభను ఎవరూ ఆపలేరు. మురికివాడల్లో ఉన్నా అవకాశాలు తన్నుకొచ్చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement