Rap Group
-
ర్యాప్ స్టార్ పాడు పని : 24 ఏళ్ల జైలు
లండన్ : వర్ధమాన ర్యాప్‌స్టార్ తన నిర్బంధంలో ఉన్న నలుగురు మహిళలపై వారి ఇష్టానికి విరుద్ధంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై బ్రిటన్ కోర్టు అతడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. సోలో 45 అనే స్టేజ్ పేరుతో పేరొందిన ఆండీ అనోక్యే 2017లో లైంగిక నేరాలపై పట్టుబడినప్పుడు విలే, స్టార్మీ వంటి స్టార్లతో కలిసి పనిచేశాడు. 21 లైంగిక దాడి కేసుల్లో దోషిగా తేలిన ర్యాప్ ఆర్టిస్ట్ అనోక్యే (33)కు బ్రిస్టల్‌లోని సౌత్వెస్ర్టన్ సిటీ కోర్టు 5 సార్లు తప్పుడు శిక్షలు విధించినట్టు వెల్లడైంది. కాగా ర్యాప్ ఆర్టిస్ట్ వికృత లైంగిక ఆనందానికి బానిసగా మారాడని తాజా తీర్పు వెలువరిస్తూ జడ్జి విలియం హార్ట్ వ్యాఖ్యానించారు. చదవండి : డ్యూటీ దిగాక రూమ్‌కి రావాలని వేధింపులు అనోక్యే ప్రముఖ ర్యాప్ బృందంలో సభ్యుడని, తోటి సభ్యులు వారి వృత్తిలో ఘన విజయాలు సాధించారని జడ్జి పేర్కొన్నారు. అనోక్యే అకృత్యాలను బాధిత మహిళలు సహించలేరని వ్యాఖ్యానించారు. కత్తితో బెదిరించి అనోక్యే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ బాధిత మహిళ వెల్లడించగా, అనోక్యే తన పట్ల దారుణంగా వ్యవహరించాడని మరో మహిళ పేర్కొన్నారు. మహిళలతో తాను వారి సమ్మతితోనే ‘క్యాచ్ మి, రేప్ మి’ గేమ్‌లో భాగంగా ఇలా చేశానని అనోక్యే కోర్టుకు తెలిపాడు. లైంగిక దాడి కేసులో అనోక్యేను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి ఫోన్లో అనోక్యే నిర్వాకాలకు సంబంధించిన పలు వీడియోలను గుర్తించారు. -
‘కాలా’ కోసం ముంబై ర్యాప్ గ్రూప్!
అది ముంబైలోని ధారావి. ప్రపంచంలో ఉన్న పెద్ద మురికివాడల్లో అదొకటి. అక్కడ మురికిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఓ ర్యాప్ గ్రూప్ చాలా ఫేమస్. ఆ గ్రూప్‌లో ఉన్నది నలుగురే. టీవీ షోస్, స్ట్రీట్ షోస్‌లో ఈ ర్యాప్ గ్రూప్ చేసే సందడికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, మరాఠీ, మలయాళం భాషల్లో ఈ గ్రూప్ సాంగ్స్ తయారు చేసి, పాడుతుంటారు. ఈ ర్యాప్ గ్రూప్‌కి ఓ జాక్‌పాట్ తగిలింది. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కాలా’లో ఛాన్స్ దక్కింది. చిత్రదర్శకుడు పా. రంజిత్ వీళ్లను హిప్–హాప్ గ్రూప్‌గా సినిమాలో చూపించనున్నారు. ఈ సన్నివేశాల్లో వచ్చే పాటకు ఈ ర్యాప్ గ్రూప్ ట్యూన్ కూడా రెడీ చేసింది. అంతా ఓ కలలా అనిపిస్తోన్న ఈ గ్రూప్‌కి రజనీకాంత్‌ని కలవడం ఓ స్వీట్ షాక్‌లా అనిపించిందట. షూటింగ్ స్పాట్లో రజనీ సార్‌ని కలసినప్పుడు నోట మాట రాకుండా ఆయన్ను చూస్తూ ఉండిపోయామని ర్యాప్ గ్రూప్‌లో ఒకరైన టోనీ సెబాస్టియన్ పేర్కొన్నారు. సూపర్‌స్టార్ రజనీ సార్ సినిమాలో ఛాన్స్ రావడం మాకు ఆనందంగా ఉందన్నారు. అంతే... ప్రతిభను ఎవరూ ఆపలేరు. మురికివాడల్లో ఉన్నా అవకాశాలు తన్నుకొచ్చేస్తాయి.