
సూపర్‌స్టార్ నుంచి చాలా నేర్చుకోవాలి
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయంటోంది నటి హ్యూమఖురేషీ. మోడలింగ్ రంగం నుంచి బుల్లి తెరకు ఆపై వెండితెరకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వస్పేపూర్ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన హ్యూమఖురేషీ పలు హిందీ, ఆంగ్ల పత్రికల ముఖ చిత్రాలకు గ్లామరస్‌గా ఫొటోలు దిగి మరింత పాపులర్ అయ్యింది. ఈ ఐదేళ్లలోనే దాదాపు 20 చిత్రాల వరకూ నటించేసిన హ్యూమ ఖురేషీ ఇప్పటికే దక్షిణాదిలో కూడా రౌండ్ కొట్టేస్తోంది.
గత ఏడాది మలయాళంలో మమ్ముట్టితో జత కట్టిన ఈ భామ తాజాగా మన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సంగతి తలిసిందే. కబాలి చిత్రం తరువాత రజనికాంత్ మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న కాలా చిత్రంలో సముద్రకని, అంజిలి పాటిల్, షియాజీ షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న కాలా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.
ఈ సందర్భంగా కాలా చిత్రంలో నటించడం గురించి హ్యూమఖరేషీ పేర్కొంటూ రజనీకాంత్ అంతటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని అంది. అసలు ఆయనతో నటించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నానని, కాలా చిత్రంలో తాను రజనీకాంత్‌తో నటించే సన్నివేశాలు చాలా స్పెషల్‌గా ఉంటాయని చెప్పింది. రజనీకాంత్ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయని, ఈ చిత్రంలో నటించడం ద్వారా తానూ చాలా పాఠాలు నేర్చుకుంటున్నానన హ్యూమఖురేషీ చెప్పుకొచ్చింది.