
చెన్నైలో ముంబై!
...హెడ్డింగ్ చదివి చెన్నైలో ముంబై ఎక్కడ ఉందా? అని ఆరా తీసే పనిలో పడాలనుకుంటున్నారా?
...హెడ్డింగ్ చదివి చెన్నైలో ముంబై ఎక్కడ ఉందా? అని ఆరా తీసే పనిలో పడాలనుకుంటున్నారా? ఒక్క క్షణం. చెన్నై ఎక్కడ ఉందో అక్కడే ఉంది. మ్యాప్‌లో ఉన్నట్లుగానే ముంబై ఎక్కడ ఉండాలో అక్కడ చెక్కు చెదరకుండా ఉంది. మరి.. చెన్నైలో ముంబై ఏంటి? అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే... రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ తెరకెక్కిస్తు్తన్న సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు.
ముంబైలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన చిత్రబృందం... ఈసారి ఆ మహానగరానికి సంబంధించిన సన్నివేశాలను చెన్నైలో తీయాలనుకున్నారు. అందుకే చెన్నైలో ముంబై సెట్ వేశారట. తమ చిత్రీకరణకు అనుగుణంగా కొన్ని ఏరియాలను సెట్స్‌లో రీ–క్రియేట్ చేశారు. ముంబైలో జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో రజనీపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఇప్పుడు చెన్నై షెడ్యూల్‌లో హీరోయిన్ హ్యూమా ఖురేషిపై చిత్రీకరించనున్నారట. ఆగస్టు చివరి వారం వరకు సాగే ఈ షెడ్యూల్‌లో రజనీ, హ్యూమాలపై ఒకటి, రెండు పాటలను కూడా షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.