
ఒక్క పక్క ఫ్యాన్స్ మీట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ బిజీగా ఉన్నారు. మరోపక్క ‘కాలా’ టీమ్ కూడా బిజీగానే ఉంది. ‘కబాలి’ ఫేమ్ రంజిత్. పా దర్వకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. దర్శక–నిర్మాత, హీరో, రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా రూపొందిన ‘2.0’ చిత్రం కంటే ముందుగా ‘కాలా’నే తెరపైకి వస్తుందనే వార్త షికారు చేస్తోంది.
ఈ వార్తలను యూనిట్ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ‘కాలా’ని వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. లైకా ప్రొడక్షన్స్ ముందు ప్రకటించిన ప్రకారమే ‘2.0’ ఏప్రిల్‌లోనే విడుదలవుతుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... ‘2.0’ సినిమాను సౌదీ అరేబియాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ ఖబర్. రీసెంట్‌గా సౌదీ ప్రభుత్వం సినిమాలపై నిషేధం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment