
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన పీవీ సింధు, రజనీ, సాయిరాజ్‌లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ సింధు, రజనీ, సాయిరాజ్‌లను ఘనంగా సన్మానించారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది. ఇక భారత మహిళల హాకీ జట్టులో రజనీ గోల్ కీపర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 41 ఏళ్ల తర్వాత సెమీస్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.