న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు...ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే పారిస్ ఒలింపిక్స్ కూడా అర్హత సాధించింది.
సోమవారంతో ఒలింపిక్ క్వాలిఫయింగ్ గడువు ముగిసింది. భారత్ నుంచి ఏడుగురికి బెర్త్‌లు లభించాయి. నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌లో టాప్–16లో నిలిచిన క్రీడాకారులకు ఒలింపిక్ బెర్త్‌లు అధికారికంగా ఖరారవుతాయి.
ర్యాంకులు ఇలా..
ప్రస్తుతం సింధు 12వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రణయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీకి ఒలింపిక్ బెర్త్ దక్కింది. అశ్వినికిది మూడో ఒలింపిక్స్‌కాగా, తనీషా తొలిసారి విశ్వ క్రీడల్లో పోటీపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment