సల్మాన్‌తో లాంగ్ డ్రైవ్? | Long drive with Salman? | Sakshi
Sakshi News home page

సల్మాన్‌తో లాంగ్ డ్రైవ్?

Published Fri, Feb 12 2016 10:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్మాన్‌తో  లాంగ్ డ్రైవ్? - Sakshi

సల్మాన్‌తో లాంగ్ డ్రైవ్?

గాసిప్

రణ్‌బీర్‌కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు సల్మాన్‌తో అంతంతమాత్రంగానే ఉన్న కత్రినా కైఫ్ బ్రేకప్ అయ్యాక మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యారనే వార్తలు బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సల్మాన్‌ఖాన్ -కత్రినాకైఫ్‌లు తరచుగా అక్కడ క్కడ జంటగా కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతున్నాయి.

కత్రినా కైఫ్ తాను నటించిన తాజా సినిమా ప్రచారంలో భాగంగా సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన షోలో పాల్గొన్నారు. సడన్‌గా అక్కడికి సల్మాన్‌ఖాన్ రావడంతో అక్కడంద రూ ఆశ్చర్యపోయారట. ఈ  షో అయిపోయేంతవరకూ కత్రినా కైఫ్ కోసం వెయిట్ చేశారు సల్మాన్. ఆ తర్వాత తన  డ్రైవర్‌ను పంపించేసిన కత్రిన వెంటనే సల్మాన్‌ఖాన్ కారుతో లాంగ్‌డ్రైవ్‌కు వెళిపోయారట. మరి వీరిద్దరి మధ్య బంధం ఎంతకాలమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement