'అతను మళ్లీ పుంజుకోవడం ఖాయం' | Ranbir will bounce back after a rough phase: Katrina ` | Sakshi
Sakshi News home page

'అతను మళ్లీ పుంజుకోవడం ఖాయం'

Published Mon, Sep 14 2015 12:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'అతను మళ్లీ పుంజుకోవడం ఖాయం' - Sakshi

'అతను మళ్లీ పుంజుకోవడం ఖాయం'

ముంబయి: ఈ మధ్య వరుస ప్లాపులతో కాస్త విసుగ్గా కనిపిస్తూ మొఖం చాటేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ను ఆయన ప్రేయసిగా చెప్పుకునే బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ వెనకేసుకొచ్చింది. రణ్ బీర్ మరోసారి పుంజుకుంటాడని, మళ్లీ హిట్ చిత్రాలతో దూసుకొస్తాడని అంటోంది. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండానే ప్రతి చిత్రానికి హృదయంపెట్టి రణ్ బీర్ పనిచేస్తాడని, ఒక నటుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఇదేనని అన్నారు.

బేషరమ్, రాయ్, బోంబే వెల్వేట్వంటి చిత్రాలు ఫ్లాప్ అవడంతో రణ్ బీర్ మనసు గాయపడిందని, తన అభిమానుల అంచనాలు అందుకోలేకపోయానన్న బాధలో రణ్ బీర్ ఉన్నాడని తనకు తెలుసు అని చెప్పింది. సినిమాలంటే రణ్ బీర్కు ఉన్నంత ఆసక్తి మరే నటుడిలోనూ చూడలేదన్న ఈ అమ్మడు.. మరోసారి రణ్ బీర్ పుంజుకోవడం మాత్రం ఖాయం అని చెప్పుకొచ్చింది. అయిన ఒక నటుడు అన్నాక ఎత్తు పల్లాలు సహజం అని వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement