ప్రియుడికి కేక్ షాక్! | with the shock of the cake | Sakshi
Sakshi News home page

ప్రియుడికి కేక్ షాక్!

Published Mon, Sep 28 2015 11:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రియుడికి  కేక్  షాక్! - Sakshi

ప్రియుడికి కేక్ షాక్!

నచ్చినవాళ్లకు రోజుల తరబడి దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. అదే ప్రేమలో ఉన్నవాళ్లయితే తెగ బాధపడిపోతారు. బాలీవుడ్ క్రేజీ లవర్స్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు అలాగే బాధపడిపోతుంటారట. ఈ ఇద్దరూ జంటగా కలిసి నటించినప్పుడు ఓకే కానీ, వేరు వేరు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు మాత్రం ఒకర్ని వదిలి మరొకరు ఉండలేని పరిస్థితి. అందుకే, వీలు చేసుకుని ఏకంగా షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లిపోతుంటారు. పైగా, బర్త్‌డే లాంటి అకేషన్స్ అయితే, అస్సలు మిస్ కారట. ఆ టైమ్‌లో ఒకవేళ ఎవరో ఒకరు విదేశాల్లో ఉంటే, ఇంకొకరు అక్కడికి వెళ్లిపోతుంటారట. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ లండన్‌లో ఉన్నారు.

ఇతగాడు హీరోగా నటిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం షూటింగ్ అక్కడ జరుగుతోంది. సోమవారం రణ్‌బీర్ బర్త్‌డే కావడంతో యూనిట్ అంతా పార్టీ మూడ్‌లో ఉన్నారట. సడన్‌గా ఆ లొకేషన్‌కు కత్రినా కై ఫ్ ఎంట్రీ  ఇచ్చారు. దీంతో రణ్‌బీర్ ఆనందానికి అవధుల్లేవట. బర్త్‌డే కేక్‌తో కత్రినా ఇచ్చిన ఈ స్వీట్ షాక్ నుంచి బర్త్‌డే బాయ్ తేరుకోవడానికి చాలాసేపే పట్టిందని సమాచారం. చిత్రదర్శకుడు కరణ్‌జోహార్, కథానాయికలుగా నటిస్తున్న ఐశ్వర్యా రాయ్, అనుష్కా శర్మ తదితరులు కత్రినాతో సరదాగా ముచ్చట్లు చెప్పడంతో పాటు రణ్‌బీర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా చేశారట. కొస మెరుపు ఏంటంటే.. ప్రియురాలు ఇలా లండన్ వెళ్లిందో లేదో... రణ్‌బీర్ తల్లి నీతూకపూర్ కూడా ప్రయాణం అయ్యారట. అయితే, కత్రినా ముందు చేరుకున్నారు. మొత్తం మీద ఒకవైపు ప్రియురాలు.. మరోవైపు తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో రణ్‌బీర్‌కి ఈ బర్త్‌డే ఎప్పటికీ మర్చిపోలేనిదిగా నిలిచిపోతుందని చెప్పొచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement