మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..! | Katrina Kaif seems to be in a rather foul mood these days | Sakshi
Sakshi News home page

మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..!

Published Sat, May 28 2016 4:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..! - Sakshi

మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..!

ముంబై: బాలీవుడ్ ప్రేమపక్షులు ఎప్పుడు ఏం చేస్తాయో, ఏం మాట్లాడతాయో చెప్పలేం. వ్యవహారం కాస్త బెడిసికొడితే చాలు బ్రేకప్ చెప్పేస్తారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ క్యూట్ పెయిర్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్. వీరి ప్రేమ వ్యవహారంపై అప్పట్లో ఏదో ఒక వార్త ప్రచారంలో ఉండేది. బ్రేకప్ చెప్పాక కూడా ఎవరు ఎవరితో ఎలా మూవ్ అవుతున్నారన్న దానిపై చర్చ జరిగింది.

బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మ కత్రినా చిర్రుబుర్రు లాడుతోందట. మీడియా కనిపిస్తే చాలు ఆమెకు పట్టరాని ఆగ్రహం వచ్చేస్తోంది. కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన కత్రినా ముఖంపై చిరునవ్వు మాయపై చాలా రోజులైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఏదో మూవీ సినిమా షూటింగ్ నిమిత్తం మొరాకో వెళ్లిన కత్రినా నిన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇండియాకు వచ్చిందన్న వార్త తెలిసిన మీడియా ఆమెను కలిసేందుకు వెళ్లింది. అతి కష్టం మీద ఆమెను కలిశారు.

కారులో ఎక్కే సమయంలో అక్కడికి వచ్చి.. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు. ఏమైనా సమాచారం చెబుతారా అని ఓ విలేఖరి అడిగాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ వారిపై ఒక్కసారిగా మండిపడింది. అసలు విషయం ఏంటంటే.. మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి లేటెస్ట్ మూవీ 'జగ్గా జాసూస్'లో మళ్లీ జతకట్టనున్నారు. రణబీర్ విషయంపై అడుగుతారేమోనని భావించిన కత్రినా తానే మీడియాపై ఎదురుదాడికి దిగిందని బాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement