కలెక్షన్లు పెరుగుతున్నాయ్..! | jagga jasoos box office collection | Sakshi
Sakshi News home page

కలెక్షన్లు పెరుగుతున్నాయ్..!

Published Sun, Jul 16 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

కలెక్షన్లు పెరుగుతున్నాయ్..!

కలెక్షన్లు పెరుగుతున్నాయ్..!

ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తాజా చిత్రం జగ్గా జాసూస్. తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్తో కలిసి నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో జగ్గా జాసూస్ థియేరట్ల వద్ద ఓపెనింగ్ హడావిడి పెద్దగా కనిపించలేదు. అయితే సినిమా పై డివైడ్ టాక్ వచ్చినా రణబీర్ నటనకు ప్రశంసలు రావటంతో రెండో రోజు కలెక్షన్లు ఊపందుకున్నాయి.

తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయినా జగ్గా జాసూస్కు రెండో రోజు 11 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. తొలి రెండు రోజుల్లో 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జగ్గా జాసూస్, రణబీర్, కత్రినాల గత చిత్రాలతో పోలిస్తే మంచి వసూళ్లను రాబట్టింది. తన సినిమాలకు నష్టాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేస్తాన్న రణబీర్ కు ఆ అవసరం రాకపోవచ్చంటున్నారు బిజినెస్ ఎనలిస్ట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement