jagga jasoos
-
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. -
కొడుకు సినిమా ప్లాప్: డైరెక్టర్‌పై నటుడి ఫైర్
తన కొడుకు రణ్‌బీర్ కపూర్ తాజా సినిమా 'జగ్గాజాసూస్' అట్టర్‌ప్లాప్ కావడంతో దర్శకుడు అనురాగ్ బసుపై రిషీకపూర్ ఫైర్ అయ్యారు. అనురాగ్ బసుకు బాధ్యతారాహిత్యం ఎక్కువ అని, అతను సినిమాను అనుకున్న సమయానికల్లా విడుదల చేయలేకపోయాడని విరుచుకుపడ్డారు. సంగీత దర్శకుడు ప్రీతంపై కూడా ఆయన మండిపడ్డారు. ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించలేదని విమర్శించారు. రణ్‌బీర్ కపూర్-కత్రినాకైఫ్ జోడీగా బసు దర్శకత్వంలో తెరకెక్కిన 'జగ్గాజాసూస్' పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని సంగతి తెలిసిందే. రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలివారాంతానికి రూ. 45 కోట్లు వసూలు చేసింది. రెండోవారాంతానికి ఈ సినిమా వసూళ్లు గణనీయంగా 85శాతం తగ్గిపోయి.. థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు రిషీకపూర్ 'మిడ్-డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బసును చెడామడా వాయించేశారు. 'పోయిన బుధవారం వరకు కూడా సినిమాను మిక్సింగ్ చేస్తూ అనురాగ్ బసు గడిపాడు. మీరు అలాంటిది ఊహించగలారా? ప్రీతం కూడా (విడుదలకు) ఒకవారం ముందే సంగీతం అందించినట్టు ఉంది. కనీసం సినిమాపై ముందే అభిప్రాయం కూడా తీసుకోకుంటే ఏం చెప్తాం. ఇప్పటి దర్శకులు అందరితో ఇదేరకంగా వ్యవహరిస్తున్నారు. విడుదలకు ముందే సినిమాను చూపించి అభిప్రాయం తీసుకోవడం లేదు. తామేదో అణుబాంబును తయారుచేస్తున్నట్టు భావిస్తున్నారు. నేను (జగ్గాజాసూస్) సినిమాను ప్రేమించను, ద్వేషించను. కానీ సినిమాలో 20నిమిషాలు ఎడిట్ చేస్తే బాగుండేది. బస్సును ఎక్తాకపూర్ గెంటేయడం సరైనదే. (2010లో) కైట్ సినిమా సమయంలో రాకేష్ రోషన్‌తో కూడా అతను ఇలాగే వ్యవహరించాడు. అతను బాధ్యతారాహిత్యమైన దర్శకుడు. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయడు. గత రెండేళ్లలో మూడుసార్లు ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయినా వాయిదా వేస్తూ వచ్చారు' అని రిషీ మండిపడ్డారు. అంతర్జాతీయంగా కొన్నిదేశాల్లో సినిమా విడుదల కాకపోవడానికి కూడా దర్శకుడు బసు చేసిన ఆలస్యమే కారణమని మండిపడ్డారు. -
సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్
ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. లాంగ్ లెగ్స్ బ్యూటీ కత్రినా కైఫ్ షూటింగ్ లకు గ్యాప్ రావటంతో మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా జగ్గా జాసూస్ సినిమాతో నటిగానూ మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే జగ్గా జాసూస్ సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్ కోసం హాలీడేస్ కి దూరంగా ఉన్న ఈ భామ అన్ని పనులు ముగించుకొని మొరాకో టూర్ కు వెళ్లింది. అక్కడ అందమైన ప్రదేశాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది. కత్రినా తాజాగా ఓ సర్ఫింగ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. అలలపై సర్ఫింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది క్యాట్. సర్ఫింగ్ ఎక్స్పర్ట్ సమక్షంలోనే క్యాట్ ఈ రిస్క్ చేసిందట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైల్ అవుతోంది.ఈ టూర్ ముగింసిన తరువాత సల్మాన్ ఖాన్ తో కలిసి 'ఏక్ థా టైగర్౮ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'టైగర్ జిందా హై' సినిమా చేయనుంది. First time surfing in Essaouira 🏄🏻♀️ A post shared by Katrina Kaif (@katrinakaif) on Jul 21, 2017 at 8:58am PDT -
భారీ బడ్జెట్: కలెక్షన్లు బాగున్నా.. ప్లాప్ తప్పదా!
'జగ్గా జాసూస్'.. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా నటించిన తాజా మ్యూజికల్ అడ్వెంచర్ మూవీ. మొదటి వారాంతంలో ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. తొలి మూడురోజుల్లో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఇవి మంచి వసూళ్లే. చిన్న సినిమా అయితే.. ఈపాటికి సూపర్‌హిట్ క్రెడిట్ కూడా వచ్చేది. కానీ, 'జగ్గా జసూస్' భారీ బడ్జెట్ సినిమా. ప్రఖ్యాత నిర్మాణ డిస్నీ.. ఫీల్‌గుడ్ కంటెంట్‌తో రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించింది. అందుకే ఈ సినిమా హిట్టా.. ఫట్టా ఇప్పుడే చెప్పలేమంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం.. జగ్గాజాసూస్ తొలిరోజు రూ. 8.57 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు రూ. 11.53 కోట్లు రాబట్టింది. మూడోరోజు ఆదివారం మరికాస్త మెరుగుపడి రూ. 13.07 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తం రూ. 33.17 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. ఈ సినిమాకు క్రమంగా ఫ్యామిలీ ఆడియెన్స్ పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం. అయితే, రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలను తప్పించుకుంటుందా? అన్నది సోమవారం వసూళ్ల వివరాలు వస్తే తప్పా చెప్పలేమని బాలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. రూ. 40.. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొంది ఉంటే.. లాభాలు దక్కించుకొని ఉండేదని అంటున్నారు. -
జగ్గా జాసుస్‌పై అమూల్ సూపర్ కార్టూన్
ముంబై: దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత అనురాగ్ బసు తెరకెక్కించిన చిత్రం జగ్గా జాసుస్ ఎట్టకేలకు జూలై 14 న విడుదలైంది. ఈచిత్రంలో రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. పలు ఆందోళనలతో ఈ చిత్రం మూడేళ్ల పాటు విడుదల కాకుండా ఉంది. పసందైన మ్యూజిక్, అడ్వెంచర్లతో సినిమా ప్రేమికులను అలరిస్తోంది. సినిమాటోగ్రఫీ సినిమాని మరో అంచుకు తీసుకెళ్లింది. సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రంపై అమూల్ బ్రాండ్ ప్రత్యేక కార్టూన్‌తో ముందుకు వచ్చారు. తమ కార్టూన్ పోస్టర్లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్లకు నమూనాగా అందమైన అమ్మాయి, అబ్బాయిల ఫొటోలతో ఈ సినిమా పోస్టర్ తయారు చేసింది. అంతే కాకుండా 'హర్ జగ్గా ఖావో' శీర్షిక, 'అమూల్ బ్లాక్బ్టస్టర్ బట్టర్' ట్యాగ్‌లైన్‌తో సినిమా సారాంశం చెప్పడానికి ప్రయత్నించింది. సినిమాలో కామెడీ, రొమాన్స్, మ్యూజిక్, అడ్వెంచర్ చాలా ఉన్నాయని, అమూల్ వెన్నలో కూడా అన్నీ ఉన్నాయని అమూల్ పోల్చింది. ఫ్రెంచ్ వంటకాలు ఎన్ని ఉన్నా దేసీ పావ్ భాజీ, లేకుండా అసంపూర్తిగా ఉంటుందనే సందేశాన్ని అందించింది. -
కలెక్షన్లు పెరుగుతున్నాయ్..!
ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ తాజా చిత్రం జగ్గా జాసూస్. తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో జగ్గా జాసూస్ థియేరట్ల వద్ద ఓపెనింగ్ హడావిడి పెద్దగా కనిపించలేదు. అయితే సినిమా పై డివైడ్ టాక్ వచ్చినా రణబీర్ నటనకు ప్రశంసలు రావటంతో రెండో రోజు కలెక్షన్లు ఊపందుకున్నాయి. తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయినా జగ్గా జాసూస్కు రెండో రోజు 11 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. తొలి రెండు రోజుల్లో 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన జగ్గా జాసూస్, రణబీర్, కత్రినాల గత చిత్రాలతో పోలిస్తే మంచి వసూళ్లను రాబట్టింది. తన సినిమాలకు నష్టాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేస్తాన్న రణబీర్ కు ఆ అవసరం రాకపోవచ్చంటున్నారు బిజినెస్ ఎనలిస్ట్‌లు. -
సినిమా ఫ్లాప్ అయితే డబ్బులు తిరిగిస్తా : హీరో
బాలీవుడ్ రణబీర్ కపూర్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇంత వరకు తన స్థాయికి తగ్గ ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. నటుడిగా మంచి మార్కులు సాధించినా.. కమర్షియల్ హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తాజాగా తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి జగ్గా జాసూస్ సినిమాలో నటించాడు. అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు రణబీర్. తాజాగా సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్. అనుకున్నట్టుగా సినిమా విజయం సాధించకపోతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తెలిపాడు. తన తాతాల కాలం నుంచే ఈ సాంప్రదాయం ఉందని.. నేనూ అదే కొనసాగిస్తానన్నాడు రణబీర్. 'మా తాత రాజ్ కపూర్, తండ్రి రిషీ కపూర్ కలిసి నటించిన మేరానామ్ జోకర్ సినిమా ఫ్లాప్ అయ్యింది, తరువాత వచ్చిన బాబీ ఘనవిజయం సాధించటంతో ఆ డబ్బులను మేరానామ్ జోకర్ కు నష్టపోయిన వారికి ఇచ్చారని' తెలిపాడు. జగ్గా జాసూస్ విషయంలో తాను కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. -
సంజయ్ బయోపిక్‌పై లేటెస్ట్ అప్డేట్
-
సంజయ్ బయోపిక్‌పై లేటెస్ట్ అప్డేట్
తన ప్రతీ సినిమాతో రికార్డులు తిరగ రాస్తున్న గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ , ప్రస్తుతం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలసిందే. సంజయ్ దత్ హీరోగా మున్నాభాయ్ సీరీస్ ను రూపొందించిన రాజ్ కుమార్, చాలా కాలంగా సంజయ్ బయోపిక్ ను సినిమాగా రూపొందించాలని ప్రయత్నించాడు. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న రణబీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందన్న రణబీర్, తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన విదూ వినోద్ చోప్రా, సంజయ్ దత్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న జగ్గా జాసూస్ వివాదం పై కూడా స్పందించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గానటించిన కత్రినా కైఫ్ సినిమా ప్రమోషన్ కు సహకరించటం లేదన్న వార్తలను రణబీర్ ఖండించాడు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా కత్రినా ప్రమోషన్ కు రావటం లేదని, ఫ్రీ అవ్వగానే పబ్లిసిటీ కార్యక్రమాల్లో కనిపిస్తుందని తెలిపాడు. -
ఒక్క సినిమాలో 29 పాటలు
ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట. గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి జగ్గా జాసూస్‌లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. -
ఆ హీరోయిన్ ముఖం ఎందుకు ఉబ్బింది?
అందమైన ముఖవర్ఛస్సు కలిగి.. చూడగానే ఆకట్టుకునే రూపం కత్రినా కైఫ్ది. సొగసైన ఈ బాలీవుడ్ ముద్దగుమ్మ ముఖం ఈ మధ్య కాస్తా ఉబ్బినట్టు కనబడటం పలు అనుమానాలకు తావిచ్చింది. తన అందాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు కదా అని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఆమెను పంటినొప్పి వేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జ్ఞానదంతాన్ని తొలగించుకోవాలని ఆమె నిర్ణయించారు. అయితే, ఈ విషయమై రెండుసార్లు డాక్టర్ అపాయింట్మెంట్ను ఎగ్గొట్టడం, పంటినొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయోటిక్స్ తీసుకోవడంతో ఆమె ముఖంపై ఆ ప్రభావం పడింది. దీంతో ఆమె ముఖం కొంత ఉబ్బినట్టు స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఫొటోగ్రాఫర్ మారియో టెస్టినోను కలిసినప్పుడు, దర్శకుడు అనురాగ్ బస్సు ఇంట్లో పూజలో పాల్గొన్నప్పుడు దిగిన ఫొటోల్లో ఈ విషయం బయటపడింది. దీంతో రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఆమె నేడో రేపో ఈ పంటినొప్పికి సర్జరీ చేయించుకొని.. నొప్పికి కారణమైన జ్ఞానదంతాన్ని తొలగించకోనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాజీ లవర్ రణ్‌బీర్ కపూర్ సరసన 'జగ్గా జాసుస్' సినిమాలో కత్రిన నటిస్తున్న సంగతి తెలిసిందే. -
దర్శకుడికి కటింగ్ చేసిన హీరోయిన్!
-
దర్శకుడికి కటింగ్ చేసిన హీరోయిన్!
హీరోయిన్లను సినీ తెరపై అందంగా చూపించేందుకు సెట్స్‌లో చాలామందే కష్టపడుతుంటారు. మేకప్ మ్యాన్లు, హెయిర్ స్టైలిష్టులు.. ఇలా పలువురు తెరపై భామలు అందంగా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంతమంది సెట్స్‌లో ఉన్నా.. దర్శకుడి కోసం కత్రినా కైఫ్ స్వయంగా హెయిర్ స్టైలిష్ట్ అవతారం ఎత్తింది. ట్రిమ్మర్ తీసుకొని డైరెక్టర్‌కు కటింగ్ కూడా చేసింది. 'జగ్గా జాసుస్' షూటింగ్ సెట్స్‌లో ఈ ఘటన జరిగింది. దర్శకుడు అనురాగ్ బసుకు ఆమె స్వయంగా ట్రిమ్మర్ మిషిన్‌తో కటింగ్ చేసింది. కత్రిన ఇలా తనపై ప్రయోగం చేస్తుండగా.. తాను ఏడుస్తూ.. భరిస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్లో పెట్టారు. మాజీ ప్రేమికులైన కత్రినా కైఫ్, రణ్‌బీర్ కపూర్ జంటగా 'జగ్గా జాసుస్' సినిమాను అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అనురాగ్ బసు ఇంట్లో జరిగిన గణపతి పూజలోనూ కత్రిన పాల్గొన్నది. కానీ ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. -
'జగ్గా జాసూస్' మూవీ స్టిల్స్
-
గప్‌చుప్‌గా హీరోయిన్ ఇంటికి..!
బాలీవుడ్ ప్రేమికులైన రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ గత జనవరిలో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత వీరు ఎక్కడా కలిసి కనిపించలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోనంతగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇప్పట్లో వీరు కలిసి నటించే అవకాశం కూడా లేదని అప్పట్లో కథనాలు వచ్చాయి. కానీ, ఇటీవల కత్రిన కైఫ్ కొత్త ఇంట్లో ఓ వ్యక్తిని చూసి ఆమె క్లోజ్ ఫ్రెండ్ షాక్ తిన్నదట. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం కొత్త అపార్ట్‌మెంట్‌కు మారిన కత్రినాను కలిసేందుకు ఆమె స్నేహితురాలు వచ్చింది. కత్రినతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్లబోతుండగా.. అప్పుడే రణ్‌బీర్ గప్‌చుప్‌గా ఇంట్లోకి వచ్చాడట. ఇది చూసి ఆమె స్నేహితురాలు విస్మయపోయినప్పటికీ, కత్రిన మాత్రం రణ్‌బీర్ వస్తాడని ముందే తెలిసినట్టు వ్యవహరించిందని ఓ మీడియా సంస్థ తెలిపింది. రణ్‌బీర్-కత్రిన జోడీ అనురాగ్ బసు దర్శకత్వంలో రానున్న 'జగ్గా జాసూస్' సినిమాలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు తమ మధ్య విభేదాలు తొలగించుకొనే రాజీ కుదుర్చుకునే అవకాశముందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. -
ఆస్పత్రిలో టాప్ హీరోయిన్!
ముంబై: బాలీవుడ్ అగ్రనటి కత్రినా కైఫ్ ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అందాలభామ ఉన్నట్టుండి ఆస్పత్రికి ఎందుకు వెళ్లిందా అని ఆరా తీస్తున్నారు. 'జగ్గా జాసూస్' షూటింగ్ కోసం మొరాకొ వెళ్లిన కైఫ్ అక్కడి నుంచి ముంబైకు రాగానే సరాసరి ఆస్పత్రికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఈ సినిమాలో మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి ఆమె నటిస్తోంది. వరుస షూటింగ్ లతో అలసిపోవడంతో ఆమె ఆరోగ్యం పాడైందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి ఆమె వెళ్లింది. తన మేనేజర్, మరి కొందరు మహిళా స్టాఫ్ మాత్రమే ఆమె వెంట ఉన్నారు. కత్రినా కైఫ్ ఆస్పత్రికి వెళ్లిన విషయం రహస్యంగా ఉంచేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మొరాకొ వాతావరణం తేడా చేసినందు వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిందని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, సిద్దార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న 'బార్ బార్ దేఖొ' సినిమాలోనూ కత్రిన నటిస్తోంది. -
మీడియాపై స్టార్ హీరోయిన్ ఎదురుదాడి..!
ముంబై: బాలీవుడ్ ప్రేమపక్షులు ఎప్పుడు ఏం చేస్తాయో, ఏం మాట్లాడతాయో చెప్పలేం. వ్యవహారం కాస్త బెడిసికొడితే చాలు బ్రేకప్ చెప్పేస్తారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ క్యూట్ పెయిర్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్. వీరి ప్రేమ వ్యవహారంపై అప్పట్లో ఏదో ఒక వార్త ప్రచారంలో ఉండేది. బ్రేకప్ చెప్పాక కూడా ఎవరు ఎవరితో ఎలా మూవ్ అవుతున్నారన్న దానిపై చర్చ జరిగింది. బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మ కత్రినా చిర్రుబుర్రు లాడుతోందట. మీడియా కనిపిస్తే చాలు ఆమెకు పట్టరాని ఆగ్రహం వచ్చేస్తోంది. కెరీర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన కత్రినా ముఖంపై చిరునవ్వు మాయపై చాలా రోజులైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఏదో మూవీ సినిమా షూటింగ్ నిమిత్తం మొరాకో వెళ్లిన కత్రినా నిన్న ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇండియాకు వచ్చిందన్న వార్త తెలిసిన మీడియా ఆమెను కలిసేందుకు వెళ్లింది. అతి కష్టం మీద ఆమెను కలిశారు. కారులో ఎక్కే సమయంలో అక్కడికి వచ్చి.. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు. ఏమైనా సమాచారం చెబుతారా అని ఓ విలేఖరి అడిగాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ వారిపై ఒక్కసారిగా మండిపడింది. అసలు విషయం ఏంటంటే.. మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి లేటెస్ట్ మూవీ 'జగ్గా జాసూస్'లో మళ్లీ జతకట్టనున్నారు. రణబీర్ విషయంపై అడుగుతారేమోనని భావించిన కత్రినా తానే మీడియాపై ఎదురుదాడికి దిగిందని బాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. -
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ!
కొన్ని బంధాలను అంత సులువుగా వదులుకోలేం. ఆ బంధం జీవితాంతం కొనసాగాలనుకుంటాం. ఒకవేళ మధ్యలో వదులుకోవాల్సి వస్తే, ఆ బాధ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆ పరిస్థితిలోనే ఉన్నారని సమాచారం. రణ్‌బీర్ కపూర్ నుంచి విడిపోయాక ఈ బ్యూటీ చాలా బాధలో ఉన్నట్లున్నారు. వీలైతే ఈ మాజీ ప్రియుడితో నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ తాగాలనుకుంటున్నారని ‘జగ్గా జాసూస్’ చిత్రబృందం అంటోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్లో ఇటీవల కత్రినా విచిత్రంగా బిహేవ్ చేశారట. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పగానే, ఇంటికి వెళ్లకుండా కొంతమందితో మాటలు కలిపారట. సరిగ్గా రణ్‌బీర్ కారు స్టార్ట్ చేస్తున్న సమయంలో, దానికి అడ్డంగా నిలబడి కబుర్లు మొదలుపెట్టారని సమాచారం. కారు వెళ్లే దారి లేక చాలాసేపు రణ్‌బీర్ తన వాహనంలోనే కూర్చుండిపోయారట. అతను దిగి వచ్చి, తనను జరగమంటాడనీ, ఆ విధంగా మాటలు కలపొచ్చనీ కత్రినా భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. కానీ, రణ్‌బీర్ అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో చేసేదేం లేక కత్రినానే అక్కణ్ణుంచి వెళ్లారట. సో.. కత్రినా నుంచి విడిపోయిన రణ్‌బీర్ తన పని తాను చూసుకుంటుంటే.. కత్రినా మాత్రం ఇంకా అతనితో అనుబంధాన్ని కోరుకుంటున్నారేమో. -
ఆ సినిమా జంట పెళ్లి నిజమేనా?
సినిమా హీరోహీరోయిన్స్ కలసి రెండు చిత్రాలలో నటించి, రెండుసార్లు కలిసి తిరిగితే చాలు వారి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిపోవడం సహజం. వారి మధ్య డేటింగ్ అని, ప్రేమ అని, త్వరలో పెళ్లి అని, ఇంకా ఏదోదే ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ప్రచారంలో నిజం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అసలు వారి మధ్య ఏముందో ఎప్పటికీ తెలియదు. వారు అలా కలసి నటిస్తూనే ఉంటారు. కలిసి తిరుగుతూనే ఉంటారు. ఒక్కోసారి వారు తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తుంటారు. లేదా తాము మంచి స్నేహితులమని సెలవిస్తుంటారు. బాలీవుడ్లో ఓ సినిమా జంట మధ్య ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ రొమాంటిక్ హీరో ప్రియరాలితో చెట్టాపట్టాలేసుకొని చక్కెర్లు కొడుతున్నాడని సమాచారం. స్క్రీన్ మీద, బయట కూడా వారు ప్రేమపక్షుల్లా విహరిస్తున్నారు. అంతే కాకుండా వారు ఇద్దరూ జంటగా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఇక ఊహలకు అంతేముంటుంది. ప్రచారానికి హద్దు ఏముంటుంది. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా? అదేనండి తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరి చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ముద్దుగుమ్మ కత్రిన కైఫ్. బాలీవుడ్ హీరో రణభీర్ కపూర్. వీరిద్దరూ అజబ్ ప్రేమ్‌కీ ఘజబ్ కహానీ, రాజనీతి చిత్రాల్లో కలసి నటించారు. ఈ చిత్రాల షూటింగ్ సమయంలోనే వారు ప్రేమలోపడ్డారని వార్తలోచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు ఈ జంట అన్నీ చోట్లకు చెట్టాపట్టాలేసుకోని తిరిగేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య అదిగో పెళ్ళి ఇదిగో పెళ్ళి అంటూ నానా హాడావుడి చేశారు. ఇప్పడు ఈ జంట ముచ్చటగా మూడోసారి మళ్ళీ 'జగ్గా జాసూస్' అనే మూవీ కలసి నటించనున్నారు. జగ్గా జాసూస్ చిత్రంలో రణభీర్ 18 ఎళ్ళ కుర్రోడిగా కనిపించనున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 80 శాతం పూర్తి అయిన ఈ సినిమాలో రణభీర్కి సవతి తండ్రి పాత్రలో గోవిందా నటిస్తున్నారు. ఇందులో రణభీర్ మెదటిసారిగా డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో అనురాగ్ బసుతో కలసి రణభీర్ నిర్మాతగా మారనున్నడం మరో విశేషం. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఏమిటంటే మొత్తం 25 పాటలతో దీనిని తెరకెక్కించనున్నారు. రణభీర్-కత్రిన జంటగా నటిస్తున్నారు. జంటగా తిరుగుతున్నారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడో చెప్పడంలేదు. దాంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వారు ఇద్దరూ నోరు విప్పితేగానీ ఈ ఉత్కంఠకు తెరపడదు.