ఆస్పత్రిలో టాప్ హీరోయిన్! | OMG! Katrina Kaif Spotted At The Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో టాప్ హీరోయిన్!

Published Wed, Jun 1 2016 9:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆస్పత్రిలో టాప్ హీరోయిన్! - Sakshi

ఆస్పత్రిలో టాప్ హీరోయిన్!

ముంబై: బాలీవుడ్ అగ్రనటి కత్రినా కైఫ్ ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అందాలభామ ఉన్నట్టుండి ఆస్పత్రికి ఎందుకు వెళ్లిందా అని ఆరా తీస్తున్నారు. 'జగ్గా జాసూస్' షూటింగ్ కోసం మొరాకొ వెళ్లిన కైఫ్ అక్కడి నుంచి ముంబైకు రాగానే సరాసరి ఆస్పత్రికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఈ సినిమాలో మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి ఆమె నటిస్తోంది.

వరుస షూటింగ్ లతో అలసిపోవడంతో ఆమె ఆరోగ్యం పాడైందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రికి ఆమె వెళ్లింది. తన మేనేజర్, మరి కొందరు మహిళా స్టాఫ్ మాత్రమే ఆమె వెంట ఉన్నారు. కత్రినా కైఫ్ ఆస్పత్రికి వెళ్లిన విషయం రహస్యంగా ఉంచేందుకు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మొరాకొ వాతావరణం తేడా చేసినందు వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిందని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, సిద్దార్థ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న 'బార్ బార్ దేఖొ' సినిమాలోనూ కత్రిన నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement