ఆ హీరోయిన్‌ ముఖం ఎందుకు ఉబ్బింది? | Katrina Kaif suddenly swollen face | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ ముఖం ఎందుకు ఉబ్బింది?

Published Wed, Feb 8 2017 8:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

ఆ హీరోయిన్‌ ముఖం ఎందుకు ఉబ్బింది?

ఆ హీరోయిన్‌ ముఖం ఎందుకు ఉబ్బింది?

అందమైన ముఖవర్ఛస్సు కలిగి.. చూడగానే ఆకట్టుకునే రూపం కత్రినా కైఫ్‌ది. సొగసైన ఈ బాలీవుడ్‌ ముద్దగుమ్మ ముఖం ఈ మధ్య కాస్తా ఉబ్బినట్టు కనబడటం పలు అనుమానాలకు తావిచ్చింది. తన అందాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోలేదు కదా అని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అదంతా ఒట్టిదేనని తేలిపోయింది.

ఆమెను పంటినొప్పి వేధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జ్ఞానదంతాన్ని తొలగించుకోవాలని ఆమె నిర్ణయించారు. అయితే, ఈ విషయమై రెండుసార్లు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ను ఎగ్గొట్టడం, పంటినొప్పి, ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి యాంటీబయోటిక్స్‌ తీసుకోవడంతో ఆమె ముఖంపై ఆ ప్రభావం పడింది. దీంతో ఆమె ముఖం కొంత ఉబ్బినట్టు స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఫొటోగ్రాఫర్‌ మారియో టెస్టినోను కలిసినప్పుడు, దర్శకుడు అనురాగ్‌ బస్సు ఇంట్లో పూజలో పాల్గొన్నప్పుడు దిగిన ఫొటోల్లో ఈ విషయం బయటపడింది. దీంతో రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఆమె నేడో రేపో ఈ పంటినొప్పికి సర్జరీ చేయించుకొని.. నొప్పికి కారణమైన జ్ఞానదంతాన్ని తొలగించకోనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మాజీ లవర్‌ రణ్‌బీర్‌ కపూర్‌ సరసన 'జగ్గా జాసుస్‌' సినిమాలో కత్రిన నటిస్తున్న సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement