ఒక్క సినిమాలో 29 పాటలు | Jagga Jasoos to have 29 songs | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమాలో 29 పాటలు

Published Sat, Feb 11 2017 10:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

ఒక్క సినిమాలో 29 పాటలు

ఒక్క సినిమాలో 29 పాటలు

ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట. గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్ను బ్రేక్ చేసి జగ్గా జాసూస్లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement