
గప్‌చుప్‌గా హీరోయిన్ ఇంటికి..!
బాలీవుడ్ ప్రేమికులైన రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ గత జనవరిలో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత వీరు ఎక్కడా కలిసి కనిపించలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకోనంతగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇప్పట్లో వీరు కలిసి నటించే అవకాశం కూడా లేదని అప్పట్లో కథనాలు వచ్చాయి.
కానీ, ఇటీవల కత్రిన కైఫ్ కొత్త ఇంట్లో ఓ వ్యక్తిని చూసి ఆమె క్లోజ్ ఫ్రెండ్ షాక్ తిన్నదట. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం కొత్త అపార్ట్‌మెంట్‌కు మారిన కత్రినాను కలిసేందుకు ఆమె స్నేహితురాలు వచ్చింది. కత్రినతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్లబోతుండగా.. అప్పుడే రణ్‌బీర్ గప్‌చుప్‌గా ఇంట్లోకి వచ్చాడట. ఇది చూసి ఆమె స్నేహితురాలు విస్మయపోయినప్పటికీ, కత్రిన మాత్రం రణ్‌బీర్ వస్తాడని ముందే తెలిసినట్టు వ్యవహరించిందని ఓ మీడియా సంస్థ తెలిపింది.
రణ్‌బీర్-కత్రిన జోడీ అనురాగ్ బసు దర్శకత్వంలో రానున్న 'జగ్గా జాసూస్' సినిమాలో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు తమ మధ్య విభేదాలు తొలగించుకొనే రాజీ కుదుర్చుకునే అవకాశముందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.