వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారా? | Gossip | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారా?

Published Sat, Jul 18 2015 10:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారా? - Sakshi

వాళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారా?

గాసిప్
 
బాలీవుడ్ క్రేజియస్ట్ లవర్స్ రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ ఉంగరాలు మార్చేసుకున్నారా? బాలీవుడ్‌లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం అవుననే తెలుస్తోంది. ఇటీవలే కత్రినా 32వ పడిలో అడుగుపెట్టారు. ఇలాంటి సందర్భాలు ప్రేమికులకు పండగలాంటివి. ప్రియురాల్ని వీలైనంత సంతోషంగా ఉంచాలనుకున్న  రణ్‌బీర్ ఘనంగా ఓ పార్టీ ఏర్పాటు చేశారట. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని సమాచారం. పార్టీ జోరుగా జరుగుతున్న సమయంలో కత్రినాకు రణబీర్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారట.

ప్రేమను వెల్లడిస్తూ, తనదైన శైలిలో ఆమె వేలికి ప్లాటినమ్ ఉంగరాన్ని తొడిగారని భోగట్టా. అది చూసి, కత్రిన పొంగిపోయారట. వెంటనే తన వేలికి ఉన్న ఉంగరాన్ని రణ్‌బీర్‌కి తొడిగారట. అనంతరం ఇద్దరూ కలిసి లండన్ చెక్కేశారట. పార్టీలో ఈ ఉంగరాల తతంగం చూసినవాళ్లు రణ్‌బీర్, కత్రిన త్వరలో పెళ్లి తేదీ బయటపెట్టేస్తారని సన్నిహితుల దగర్గ  చెబుతున్నారట.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement