సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు | Salman's petition rejected by jodhpor court | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు

Published Thu, May 14 2015 2:53 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు

సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు

జోధ్పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టులో చుక్కెదురు అయ్యింది. హిట్ అండ్ రన్ కేసులో  బెయిల్  తో సంబరాల్లో మునిగి తేలుతున్న సల్లూ భయ్యాకు కోర్టు షాక్ ఇచ్చింది. పదహారేళ్ల కిందట సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ను  తిరస్కరించింది.   సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ  ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
 
కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసిన  విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement