కత్రినా కోసం ఖాన్స్‌ | Zero Issaqbaazi: Shah Rukh Khan & Salman Khan song | Sakshi
Sakshi News home page

కత్రినా కోసం ఖాన్స్‌

Published Wed, Dec 5 2018 2:49 AM | Last Updated on Wed, Dec 5 2018 2:49 AM

Zero Issaqbaazi: Shah Rukh Khan & Salman Khan song - Sakshi

బాక్సాఫీస్‌ దగ్గర  పోటీపడే బాలీవుడ్‌ ఖాన్స్‌ షారుక్, సల్మాన్‌ సరదాగా డ్యాన్స్‌ ఫ్లోర్‌పై పోటీ పడ్డారు. నువ్వా? నేనా అన్నట్లుండే ఈ ఖాన్స్‌ నువ్వూ నేనూ అంటూ ఓ సాంగ్‌కి చిందేశారు. షారుక్‌ ఖాన్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జీరో’. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకుడు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటించారు.

ఇందులో షారుక్‌ మరుగుజ్జు పాత్రను పోషించారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో ‘ఇస్క్‌బాజీ..’ అనే సాంగ్‌లో కనిపించనున్నారు. ఈ పాట వీడియో సాంగ్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు. ‘జీరో’ సినిమాలో కత్రినా తన నిజ జీవిత పాత్రనే పోషించారు. ఆమె కోసం ఈ ఇద్దరు ఖాన్స్‌ సరదాగా పోటీ పడుతున్నట్టుగా ఈ సాంగ్‌ను రూపొందించారు. డిసెంబర్‌ 21న ‘జీరో చిత్రం రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement