కత్రినా కైఫ్‌కీ స్పెషల్ సాంగ్స్‌కు ఓ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ‘షీలాకీ జవానీ...’ అంటూ ‘తీస్‌మార్ ఖాన్’లో స్క్రీన్‌ని ఫైర్‌తో నింపారు. ఆ తర్వాత ‘చికినీ చమేలీ.., ధూమ్ మచాలే.., కాలా చష్మా’ అంటూ స్క్రీన్ మీద మెరుపు వేగంతో స్టెప్పులేశారు. ఆ సాంగ్సే థియేటర్‌వైపు రిపీట్ ఆడియన్స్‌ను రప్పించడానికి రీజన్ అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.
మళ్లీ అలాంటి డ్యాన్స్ నంబర్‌తో వచ్చారు. ‘హుస్న్ పర్చమ్..’ అనే సాంగ్ కోసం ‘జీరో’ సినిమాలో నర్తించారామె. ఈ పాటలో కైఫ్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు కైపెక్కిపోతారనడంలో సందేహం లేదు. షారుక్ ఖాన్ హీరోగా అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జీరో’. షారుక్ మరుగుజ్జు పాత్రలో నటించగా, హీరోయిన్ బబితా కుమారీ పాత్రలో కత్రినా నటించారు. ఈ పాటలో కైఫ్ కోసం షారుక్, సల్మాన్ పోటీపడటం విశేషం. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.
బబితా కుమారీ ఆయా
Published Thu, Dec 13 2018 12:34 AM | Last Updated on Thu, Dec 13 2018 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment