యాక్షన్‌ షురూ | Nagarjuna teams up with Salman | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ షురూ

Published Mon, Dec 23 2019 12:03 AM | Last Updated on Mon, Dec 23 2019 12:03 AM

Nagarjuna teams up with Salman - Sakshi

నాగార్జున

కొత్త దర్శకులతో సినిమాలు చేయడం నాగార్జునకు కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి అలవాటే. తాజాగా మరో కొత్త దర్శకుణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారాయన. భారీ యాక్షన్‌తో కూడిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కథతో నాగార్జున కొత్త చిత్రం ఉంటుందని సమాచారం. ‘ఊపిరి, మహర్షి’ సినిమాల్లో రచనా విభాగంలో పనిచేసిన సాల్మన్‌ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.

ఇందులో ఆయన పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ మోతాదు ఎక్కువగా ఉండబోతోందని టాక్‌. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ ఈ సినిమాకు పని చేయనున్నారట. ప్రస్తుతం ప్రీ–ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement