
సల్మాన్‌ఖాన్–ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. అది కూడా సల్మాన్‌కి మాంచి హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దబాంగ్’ సిరీస్ కావడం విశేషం. ‘దబాంగ్’ కి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ‘దబాంగ్ 2’ ని సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో
‘దబాంగ్ 3’ రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అర్బాజ్‌ఖాన్‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి.
అయితే.. ఆ అవకాశం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని వరించింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించారు. ‘‘దబాంగ్ 3’ సినిమాకు సంబంధించి గత వారం ముంబాయిలో చర్చలు జరిపాం. ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించమని సల్మాన్‌ఖాన్, అర్బాజ్ ఖాన్ కోరారు. నేనే దర్శకత్వం వహిస్తున్నా. కథానాయిక సోనాక్షీసిన్హా నటిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాతవారే ఉంటారు’’ అన్నారు ప్రభుదేవా.
Comments
Please login to add a commentAdd a comment