
మే 6న తేలిపోనున్న సల్మాన్ భవితవ్యం
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ భవితవ్యం మే 6వ తేదీన తేలిపోనుంది. సుమారు పదమూడేళ్లుగా సాగుతున్న హిట్ అండ్ రన్ కేసు విచారణకు ముంబై సెషన్స్ కోర్టు ఎట్టకేలకు ముగింపు పలకనుంది. 27 మంది సాక్షులను విచారించిన అనంతరం న్యాయస్థానం తుది తీర్పును మే 6న వెల్లడించనుంది.
2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఐదుగురిపై నుంచి సల్మాన్ కారు టోయోటా ల్యాండ్ క్రూయిజర్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయపడ్డారు. ఈ కేసు 13 ఏళ్ల నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యం సేవించి కారును నడిపారని పోలీసులు సల్మాన్పై అభియోగం మోపారు. దీనికి సంబంధించిన రక్త పరీక్షల రిపోర్టును కోర్టు ముందుంచారు.
అయితే గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపలేదని సల్మాన్ వాంగ్మూలమిస్తే , తానే నడిపానని సల్మాన్ డ్రైవర్ తెలిపాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు తీర్పు ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఉన్నారు.