ముంబయి: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్కు శిక్ష పడాల్సిందేనని తమిళ బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కోర్టు ప్రాంగణాలకు చేరుకున్న తమిళులు తమకు న్యాయం జరగాలని.. సల్మాన్కు జైలు శిక్ష పడాల్సిందేనంటూ ప్లకార్డు ప్రదర్శించారు. 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ముంబైలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో సల్మాన్ మద్యం మత్తులో కారు నడిపి బాంద్రాలోని ఒక బేకరీ ముందు పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి పోనిచ్చి అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయాలపాలవడానికి కారణమయ్యాడని కేసు నమోదైంది. అయితే, ఆ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తితో పాటు గాయపడినవారంతా తమిళియన్లే. దీంతో వారి తరుపు కుటుంబ సభ్యులు బంధువులు కోర్టు వద్దకు వచ్చి శిక్ష పడాలని డిమాండ్ చేశారు.