ఈ వారం you tube హిట్స్ | You tube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం you tube హిట్స్

Published Mon, Oct 5 2015 12:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఈ వారం  you tube హిట్స్ - Sakshi

ఈ వారం you tube హిట్స్

ప్రేమ్ రతన్ ధన్ పాయో : ట్రైలర్
నిడివి : 2 ని. 08 సె.
హిట్స్ : 59,83,741

బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఏడాది రెండు దీపావళులు! నవంబర్ 10న వచ్చే దీపావళి ఒకటి. నవంబర్ 12న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (పి.ఆర్.డి.పి) విడుదల తెచ్చే దీపావళి ఒకటి. ఈ ఫ్యామిలీ డ్రామాను సూరజ్ బర్జాత్యా డెరైక్ట్ చేస్తున్నారు. సల్మాన్ డబుల్ రోల్. సోనమ్ కపూర్ హీరోయిన్. పదహారేళ్ల విరామం తర్వాత సల్లూ, సూరజ్ కాంబినేషన్‌లో వస్తున్న పి.ఆర్.డి.పి.పై విపరీతమైన అంచనాలున్నట్లు... ఈ ట్రైలర్‌కు వస్తున్న హిట్స్‌ని చూస్తుంటే అర్థమౌతోంది. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్‌కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై... ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చినవే.
 
జెల్లీ టెన్నిస్ - ది స్లో మో గైస్
నిడివి : 5 ని. 15 సె.
హిట్స్ : 51,13,567

పిల్లలకు తప్పనిసరిగా చూపించవలసిన వీడియో ఇది. జెల్లీ ముద్దను టెన్నిస్ బాల్‌లా చేసుకుని ర్యాకెట్‌తో షాట్ కొడితే ఎలా ఉంటుంది? జెల్లీ చిందర వందర అవుతుంది. చిత్ర విచిత్ర రూపాల్లో చింది పడుతుంది. దీన్నే స్లో మోషన్‌లో చూస్తే? బిటన్ కుర్రాళ్లు గవ్, డాన్‌లకు వచ్చిన ఈ ఐడియా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిల్లల్ని కేరింతలు కొట్టిస్తోంది. గవ్ పూర్తి పేరు గవిన్ డేవిడ్ ఫ్రీ. ఈ జెల్లీ ఐడియా అతడిదే. తన ఫ్రెండ్ డేనియల్ గ్రుకీ (డాన్)తో కలిసి అతడు చాలాకాలంగా ‘ది స్లో మో గైస్’ పేరుతో యూట్యూబ్ సీరీస్ నడుపుతున్నాడు. ఆ సీరీస్‌లోని లేటెస్ట్ వీడియో ఈ జెల్లీ టెన్నిస్.
 
 
 మిలా ఫైండ్స్ అవుట్ ఆడమ్ లెవిన్  గాట్ మ్యారీడ్

నిడివి : 0 ని. 21 సె.
హిట్స్ : 27,69,815

యూత్‌లో ఎమోషన్స్ బలంగా ఉంటాయి. ఫ్యావరెట్ హీరోకో, హీరోయిన్‌కో పెళ్లయిపోతే ఇక్కడ వీళ్ల గుండె ముక్కలైపోతుంది. అయితే చిన్నారుల్లో కూడా ఇదే ఫీలింగ్ ఉంటుందా? ఉండదని చెప్పకూడదేమో. ఎందుకంటే మిలా అనే అమెరికన్ చిన్నారి తన ఫ్యావరెట్ సింగర్ ఆడమ్ లెవిన్‌కు పెళ్లయిపోయిందని తెలియగానే పట్టలేని దుఖంతో ఒక్కసారిగా ఏడ్చేసింది. ‘నో.. నో.. హి డిడిన్ట్ మమ్మీ’ అని బాధపడిపోయింది. లాస్ ఏంజెల్స్ పాప్ బ్యాండ్ ‘మెరూన్ 5’ సింగర్ లెవిన్‌కు గత జులైలోనే పెళ్లయిపోయింది. మిలాకు ఆ సంగతి కాస్త ఆలస్యంగా తెలిసింది.
 
100 ఇయర్స్ ఆఫ్ వెడ్డింగ్ గౌన్స్
నిడివి : 3 ని. 08 సె.
హిట్స్ : 24,35,837

వెస్టర్న్ స్టెయిల్స్‌ని ఇష్టపడేవారు, వెస్టర్న్‌లోనే మళ్లీ ఓల్డ్ ఫ్యాషన్‌ని ముచ్చట పడే అమ్మాయిలు వెడ్డింగ్‌కి రెడీ అవుతుంటే గనుక ఈ వీడియోను చూడొచ్చు. తమకు నచ్చిన వెడ్డింగ్ గౌన్ డిజైన్‌లను ఎంపిక చేసుకోవచ్చు. మోడల్ లోలీ హోవీతో మూడే మూడు నిమిషాల్లో వందేళ్ల వార్డ్‌రోబ్ ని సర్దిపెట్టింది ప్రసిద్ధ ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థ ‘మోడ్స్’. 1910ల నాటి హై కాలర్స్ నుంచి ఇప్పటి స్లీక్ స్టెయిల్స్ వరకు గౌన్ల డిజైన్‌లు ఎలా రూపాంతరం చెందిందీ ఇందులో చూపించారు. ఫ్యాబ్రిక్, లెంగ్త్, టెక్చర్, డిజైన్‌లలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ గౌన్ల తెలుపు రంగు మారకపోవడమే అసలైన విశేషం.
 
స్పెక్టర్ : ఫైనల్ ట్రైలర్
నిడివి : 1 ని. 16 సె.
హిట్స్ : 17,23,334

ఇరవై నాల్గవ జేమ్స్‌బాండ్ మూవీ ‘స్పెక్టర్’. డేనియల్ క్రైగ్ నాలుగోసారి బాండ్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం చిట్టచివరి ట్రైలర్ ఇది. అంటే రిలీజ్ డేట్ దగ్గర పడిందని. స్పెక్టర్ ఇండియాలో నవంబర్ 6న విడుదలౌతోంది. ఇందులోని స్పెక్టర్ అనే గ్లోబల్ క్రిమినల్ ఏజెన్సీతో బాండ్ తొలిసారి తలపడతాడు. 1971 నాటి ఏడవ బాండ్ మూవీ ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’లో తొలిసారి ‘స్పెక్టర్’ ఏజెన్సీ కనిపిస్తుంది. స్పెక్టర్‌ని శ్యామ్ మెండెస్ డెరైక్ట్ చేస్తున్నారు. విలన్‌గా క్రిస్టోఫ్ వాల్ట్‌జ్, బాండ్ గర్ల్‌గా పారిస్ అమ్మాయి లీ సెడ్యూక్స్ నటిస్తున్నారు.
 
గ్లోయింగ్ సీ టర్టిల్
నిడివి : 3 ని.
హిట్స్ : 7,49,62
1
నేషనల్ జియోగ్రఫిక్ తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ఇది. ఆ సంస్థ తరఫున పనిచేస్తున్న సముద్రగర్భ అన్వేషకుడు డేవిడ్ గ్రూబర్ వెతుకులాటలో బయటపడిన ‘గ్లోయింగ్’ సీ టర్టిల్ ఇందులో కనిపిస్తుంది. దీనికి ముద్దుగా ఆయన అండర్ వాటర్ యు.ఎఫ్.ఓ. అని పేరు పెట్టుకున్నారు. అరుదైన జాతికి చెందిన ఈ మెరిసే తాబేలు దక్షిణ పసిఫిక్ సముద్రంలోని సొలొమన్ ద్వీపంలో సాక్షాత్కరించింది. డేవిడ్ గ్రూబర్, ఆయన సహచరులు బయో ఫ్లోరోసెంట్ జీవుల కోసం రాత్రి పూట గాలిస్తుండగా నీళ్ల మాటున పగడాల దిబ్బల్లో ఈ తాబేలు కనిపించిందట.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement