'అతను ఎవరితోనైనా అంతే..' | Anushka Sharma on the Khans and who is best | Sakshi
Sakshi News home page

'అతను ఎవరితోనైనా అంతే..'

Published Tue, Jun 28 2016 5:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

'అతను ఎవరితోనైనా అంతే..'

'అతను ఎవరితోనైనా అంతే..'

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్క శర్మ. అందానికి అభినయం కూడా తోడవడంతో అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. అది కూడా బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించేసి మిగిలినవారికి గట్టి పోటీగా నిలిచింది.  షారుఖ్ సినిమా 'రబ్ నే బనాదీ జోడీ'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క.. 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో మరోసారి షారుఖ్తో కలిసి స్క్రీన్ మీద మెరిసింది.

మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్తో కలిసి 'పీకే' చిత్రంలో నటించి అందరినీ తనవైపు తిప్పుకుంది. ఇక ఎంతోమంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తర్వాత సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' లో నటించే అవకాశం అనుష్కను వరించింది. క్రీడాకారిణిగా మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైంది ఈ బ్యూటీ. ఈద్ కానుకగా సుల్తాన్ జూలై 6న విడుదల కానున్న క్రమంలో ఖాన్ త్రయంలో పనిచేసిన అనుభవాలను మీడియాతో పంచుకుంది అనుష్క.

అతను ఎవరితోనైనా అంతే..
సల్మాన్.. నిజాయితీకి మారు పేరంటూ కితాబిచ్చింది అనుష్క. సినిమా షూటింగ్ మొదలయ్యేవరకు సల్మాన్తో అంత పరిచయం లేదని, పరిచయం అయ్యాక అతనేంటో చాలా తెలుసుకున్నానని అంటోంది. సల్మాన్ ఎవరితోనైనా ఒకేలా ఉంటారని, చాలా కచ్చితంగా మాట్లాడుతారని.. మాటలు మార్చడంలాంటివి అస్సలు చేయరని చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం సులువని కూడా చెబుతోంది.

ఆ మనిషి మాయ చేసేస్తాడు..
షారుఖ్ ఎవ్వరినైనా మాయ చేసేస్తాడట. చాలా మాట్లాడతాడు.. మాటలతోనే ఎదుటివారు సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. తెలివైన వ్యక్తి కూడా. ఎదుటివారి భావాలను చెప్పకున్నా అర్థం చేసుకోగలగడం అతనికున్న క్వాలిటీ అంటోంది అనుష్క.

చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి..
ఆమీర్.. చాలా వ్యూహాత్మకమైన వ్యక్తి అంటోంది అనుష్క. తనకేం కావాలో అది రాబట్టుకునే తెలివైన వ్యక్తి, మాటకారి. మంచి సినిమాలను ఎంచుకుంటాడు, సినిమాల స్థాయిని పెంచే నటుడు అంటూ చెప్పుకొచ్చింది అనుష్కా శర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement