వెంకీ విత్‌ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ | Venkatesh Clicked with Salman’s Girlfriend | Sakshi
Sakshi News home page

వెంకీ విత్‌ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్

Published Mon, Jul 3 2017 12:32 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

Venkatesh Clicked with Salman’s Girlfriend



టాలీవుడ్‌  సీనియర్‌ హీరో , విక్టరీ వెంకటేష్‌ బాలీవుడ్‌ ప్రవేశంపై మరోసారి  ఊహాగానాలు చెలరేగాయి.   ఎప్పుడు గాసిప్స్‌కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ లులియా వాంటర్‌తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో  ఆయన బాలీవుడ్‌ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా  వీరిద్దరూ ఇలా  కెమెరాకు చిక్కారు.  దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే  పుకార్లు  జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం  సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్‌లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది.   ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు  సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్‌, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే  సమయం, సందర్భం ఏంట‍న్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది.   టాలీవుడ్‌ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది  ప్రజెంట్‌  టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా వుంది.  అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం  వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  సల్మాన్ ఖాన్‌, వెంకటేష్ మధ్య   సాన్నిహిత్యం  తెలిసిన విషయమే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement