వైరల్‌ వీడియో: పెళ్లిలో వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు | Viral Video Of Groom Angrily Slaps Bride During Varmala Ceremony | Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లిలో వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు.. 2 మిలియన్ల వ్యూస్‌!

Published Thu, Mar 3 2022 7:44 PM | Last Updated on Thu, Mar 3 2022 8:56 PM

Viral Video Of Groom Angrily Slaps Bride During Varmala Ceremony - Sakshi

ఇటీవల సోషల్‌ మీడియాలో వైరలవుతున్న వీడియోల్లో దాదాపు పెళ్లికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని డ్యాన్స్‌, ఎంజాయ్‌మెంట్‌తో సరదాగా ఉంటే మరికొన్ని పెళ్లిని పెటాకులు చేసే సీరియస్‌ వీడియోలూ ఉన్నాయి. తాజాగా పెళ్లిలో చోటుచేసుకున్న ఓ షాకింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోపంతో ఊగిపోయిన వరుడు ఒక్కసారిగా వధువు చెంపపై లాగి ఒకటిచ్చాడు. వివరాల్లోకి వెళితే..

పెళ్లి అనంతరం దండలు మార్చుకునే సందర్భంలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ఇంతలో వుధువుకి వరుడు స్వీట్‌ తినిపిస్తుండగా.. ఆమె నిరాకరించింది. దీంతో అతను స్వీట్‌ను కోపంతో పెళ్లి కూతురు ముఖంపై విసిరాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి కోపం తెచ్చుకున్న వధువు కూడా స్వీట్స్‌ను అతని ముఖంపై విసిరింది. ఇంకేముంది ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న వరుడికి ఆవేశం మరింత ఎక్కువై అతిథులందరి ముందే పెళ్లి  కూతురి చెంపచెళ్లుమనిపించాడు.
చదవండి: అక్కడ యాక్సిడెంట్‌ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే!

ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 23వేల లైకులు, 1500 కామెంట్లు వచ్చి చేరాయి. అయితే కొంతమంది వీడియోను చూసి నవ్వుకుంటుంటే మరికొంతమంది వధువును కొట్టే అధికారం వరుడికి లేదంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: సినిమా రేంజ్‌లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్‌! వైరల్‌ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement