రోబో–2 చూశారుగా.. అందులో చిన్నచిన్న పక్షులన్నీ కలిసి ఓ భారీ రాకాసి పక్షిగా మారుతాయి.. ఇది కూడా దా దాపు అలాంటిదే.. ఇటీవల ఐర్లాండ్‌లోని లాక్ ఎనెల్ సరస్సు వద్ద మందలుమందలుగా ఎగురుతున్న ఈ బుల్లి పిట్టలు ఇలా ఓ భారీ పక్షి ఆకారాన్ని తలపించాయి. ఈ చిత్రాన్ని ఐరిష్ ఫొటోగ్రాఫర్ జేమ్స్ క్రాంబీ క్లిక్‌మని పించారు. పిట్టలు గుంపులుగా ఎగరడాన్ని ఆంగ్లంలో మర్మురేషన్ అంటారు.
ఇంతకీ ఇవి ఎలా ఎందుకు కలిసి ఎగురుతాయో తెలుసా? ముఖ్యంగా తమను వేటాడే భారీ పక్షుల నుంచి భద్రత కోసమట.. వేలాదిగా ఉండటంతో.. ఒక్కదాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వాటికి కష్టమవుతుందట. అంతేకాదు.. రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం.. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందన్న సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఇలా గుంపుగా ఎగురుతాయట.
చదవండి: (ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట)
Comments
Please login to add a commentAdd a comment