చావు లేకుండా జీవించడం ఎలా? | how to live with out death ? | Sakshi
Sakshi News home page

చావు లేకుండా జీవించడం ఎలా?

Published Fri, Jan 31 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

చావు లేకుండా జీవించడం ఎలా?

చావు లేకుండా జీవించడం ఎలా?


 పంచమి ఓ మంచి ఫొటోగ్రాఫర్. ఫొటోలు తీయడానికి అడవుల్లోకి వెళ్లి, అనుకోకుండా అక్కడే రెండు రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. ఆ అడవిలో ఏం జరిగింది? పంచమి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అనే కథాంశంతో మేఘన మరియు హర్ష సమర్పణలో డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘పంచమి’. టైటిల్ రోల్‌ని అర్చన చేయగా, సుజాత భౌర్య దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు తెలుగులో రాని కథ, కథనాలతో ఈ చిత్రం చేశాం. సైంటిఫిక్‌గా మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం.
 
  తనికెళ్ల భరణిగారి వాయిస్ ఓవర్, శ్రీకోటి స్వరపరచిన పాటలు, గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సుజాత ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ నెలలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement